సెల్ ఫోన్లు మింగిన ఖైదీ !

Telugu Lo Computer
0


తీహార్ జైలులో ఖైదీగాఉన్న రామన్ సైనీ కడుపులో రెండు సెల్ ఫోన్‌లు ఉన్నాయి. ఓ కేసు విషయంలో అతను జైలు జీవితం గుడపుతున్నాడు. గత సంవత్సరం క్రితం నాలుగు సెల్‌ఫోన్లను జైలులోకి అక్రమంగా తీసుకెళ్లాడు. అయితే, వాటిని అధికారులు గుర్తిస్తారనే భయంతో మింగేశాడు. జైలు సిబ్బంది రామన్ సైనీ (28)పై అనుమానం రావడంతో తనిఖీ చేశారు. ఆగస్టు చివరి వారంలో స్కాన్ చేయగా సైనీ కడుపులోపల నాలుగు సెల్ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై ఖైదీని గట్టిగా మందలించగా ఆర్నెళ్ల క్రితం నాలుగు సెల్‌ఫోన్లను జైలులోకి తీసుకురావటం జరిగిందని, వాటిని అనుకోని పరిస్థితుల్లో మింగడం జరిగిందని, బయటకు తీయలేకపోయానని ఖైదీ జైలు అధికారులకు చెప్పాడు. ఈ ఏడాది ఆగస్టు 29న అతన్ని డీడీయూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎక్స్-రే తీయగా అతని శరీరంలో ఎటువంటి వస్తువు కనిపించలేదు. డీడీయులోని వైద్యులు అతన్ని సిటీ స్కాన్ కోసం జీబీ పంత్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. సెప్టెంబరు మొదటి వారంలో సీటీ స్కాన్, ఎండోస్కోపీ చేయగా పొట్టలో సెల్ ఫోన్‌లను కనిపించాయని, అవి ఒక్కొక్కటి 0.6 అంగుళాలు ఉన్నట్లు సైనీ కేసు గురించి తెలిసిన జైలు అధికారి చెప్పారు. వైద్యుల సలహా తర్వాత అతనికి ఎండోస్కోపీ ద్వారా రెండు సెల్ ఫోన్లు బయటకు తీయగా, మరో రెండు కడుపులోనే ఉండిపోయాయి. సైనీ శరీరం నుండి రెండు ఫోన్‌లను తీసివేసిన వైద్యుడు, ఇతర ఫోన్‌లను శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సిన అవసరం ఉందని తీహార్ జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఫోన్‌లు కొంతకాలం పాటు కడుపులో ఉంటే తుప్పు పట్టడం వల్ల, ఫోన్ బ్యాటరీలు ప్రాణాంతకం కావచ్చునని వైద్యులు తెలిపారు. రామన్ సైనీపై 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2011లో స్నాచింగ్ కేసులో జైలు పాలయ్యాడు. 2015లో జైలులో ఒక గ్యాంగ్‌స్టర్ హత్యలో కూడా పాల్గొన్నాడు. సైనీని కరడుగట్టిన నేరస్థుడుగా జైలు సిబ్బంది తెలిపారు. దొంగిలించబడిన మోటార్‌సైకిల్‌తో మేము అతనిని చివరిసారిగా 2021 ఆగస్టు 31 అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. పెరోల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన తన వైఖరిని సరిదిద్దుకోకపోవడంతో మళ్లీ మూడు నెలల్లోనే అరెస్టు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)