విశాఖలో బీఈఈ జాతీయ సదస్సు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్  స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సహకారంతో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ విశాఖపట్నంలో జాతీయ సదస్సును నిర్వహించాలని నిర్ణయించింది.  కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే కీలక విభాగం ఇది. దేశవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బుల సరఫరా, విద్యుత్ పొదుపు, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి కార్యక్రమాలను పర్యవేక్షించడం ఈ విభాగం విధి. ఇన్వెస్ట్‌మెంట్ బజార్ ఫర్ ఎనర్జీ ఎఫీషియన్సీ పేరుతో ఇది ఏర్పాటు కానుంది. రోజంతా కొనసాగుతుందీ ఇన్వెస్ట్‌మెంట్ బజార్. ఇంధన రంగంలో కార్యకలాపాలను కొనసాగిస్తోన్న భారీ పరిశ్రమల యజమానులు, ఈ సెగ్మెంట్‌కు చెందిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. రాష్ట్రంలో ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించనున్నారు. ఈ సదస్సు ఏర్పాటు కోసం ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ - ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సంయుక్తంగా సన్నాహకాలు చేపట్టాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కే విజయానంద్‌తో బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బక్రే వెబినార్ నిర్వహించారు. ఏర్పాట్ల గురించి మాట్లాడారు. దేశంలో ఎనర్జీ ఎఫీషియన్సీలో సుమారు 13.20 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని చెప్పారు. 2031 నాటికి దాదాపు రూ.10.72 లక్షల కోట్లను పరిశ్రమలు, వాణిజ్య, రవాణా సెగ్మెంట్ల ద్వారానే పెట్టుబడులు వస్తాయని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)