మేక పిల్లల బర్త్‌ డే ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 8 November 2022

మేక పిల్లల బర్త్‌ డే !


ఉత్తరప్రదేశ్‌లోని బాందా నగరంలోని కాన్షీరామ్‌ కాలనీలో  రిక్షా డ్రైవర్‌ రాజు తన దగ్గరున్న మేక పిల్లల బర్త్‌ డేను వేడుకగా చేశాడు. గ్రామంలోని ప్రజలను కూడా బర్త్ డే పార్టీలో చేర్చుకున్నాడు. డీజే పెట్టి మరీ పాటలు, డ్యాన్స్‌లతో హోరెత్తించాడు. బంధువులతో కలిసి మేక పిల్లలతో కేక్‌ కట్‌ చేయించాడు. తనకు పిల్లలు లేరని, ఈ రెండు మేకలనే తన పిల్లలుగా భావిస్తున్నానని రిక్షా డ్రైవర్‌ రాజు చెప్పాడు. ''ఈ రోజు ఈ మేక పిల్లలు మొదటి పుట్టిన రోజును జరుపుకున్నాయి. వీటిని నా సొంత పిల్లలగా చూసుకుంటున్నాను. ఈ మేక పిల్లలను రిక్షాలో కూర్చోబెట్టుకుని రోజంతా ప్రయాణిస్తాను'' అని రాజు చెప్పాడు. ప్రస్తుతం మేక పిల్లల బర్త్‌ డే వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

No comments:

Post a Comment