కుమారుడిని కొట్టి చంపిన తండ్రి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 8 November 2022

కుమారుడిని కొట్టి చంపిన తండ్రి !


హైదరాబాద్ లోని నేరెడ్‌మెట్ జేజేనగర్‌కు చెందిన సుధాకర్, దివ్య మూడేళ్ల క్రితం  ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు జీవన్ ఉన్నాడు. ఓ అపార్టుమెంట్‌లో సుధాకర్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే ఆయన భార్య కూడా పనిచేస్తోంది. సుధాకర్ మద్యానికి బానిసై పెళ్లాం, పిల్లాడిని సరిగా చూసుకోవడం లేదు. బాలుడు ఏడుస్తుండటంతో తండ్రి సహనం కోల్పోయి తీవ్రంగా కొట్టడంతో ఆ బాలుడు అపస్మారస్థితిలోకి వెళ్లిపోయాడు.  బాలుడి పరిస్థితిని గమనించిన దివ్య వెంటనే ఆస్పత్రికి తరలించింది. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మందుకు బానిసగా మారిన సుధాకర్ సైకోలా మారాడు. ఇదివరకు అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడట !. అప్పుడు బతికి బయటపడి.. ఇప్పుడు కొడుకునే మట్టుబెట్టాడు.

No comments:

Post a Comment