బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలి !

Telugu Lo Computer
0


బిగ్ బాస్ షో ఓ సాంఘిక దురాచారం వంటిదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. బిగ్ బాస్ షో రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని చెప్పారు. షోను రద్దు చేయాలని తెలంగాణలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. తెలంగాణ హైకోర్టు తన పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం స్పందించిందని వివరించారు. ఏపీ హైకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి కూడా నారాయణ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. టాస్క్ పేరుతో షోలో ఆశ్లీల కంటెంట్ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. బిగ్ బాస్ హౌస్‌ను బ్రోతల్ హౌస్‌గా కూడా చాలా సందర్భాల్లో అభివర్ణించారు. ఈ షోలో 100 రోజులు కంటెస్టెంట్లు గడపాల్సి ఉంటుంది. హిందీలో చాలా సీజన్స్ నడుస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళంలో కూడా చేస్తున్నారు. తెలుగులో నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. నాన్ స్టాప్ సమయంలో కూడా హోస్ట్ చేశారు. నాగార్జునపై నారాయణ ఫైర్ అవుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)