ఓటరు జాబితాలో పేరు ఉండేలా చూసుకోండి !

Telugu Lo Computer
0


కోల్‌కతాలో బుధవారం జరిగిన భూ పంపిణీ కార్యక్రమంలో దీదీ మాట్లాడుతూ అర్హులందరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉండేలా చూసుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటర్ లిస్టులో మీ పేరు ఉండేలా చూసుకోవాలని, లేకుంటే ఎన్ఆర్‌సీ పేరుతో డిటెన్షన్ శిబిరాలకు మిమ్మల్ని పంపుతారని ఆమె హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్‌సీ పేరుతో ఇలా చేయడం సిగ్గుచేటని దీదీ ఆక్షేపించారు. పేద ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించరాదని, ఫ్లైవోవర్ నిర్మాణం పేరుతో రైల్వేలు ఎలాంటి పరిహారం అందచేయకుండా పేదలను ఖాళీ చేయించినట్టు తన దృష్టికి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఏ ఒక్కరినీ శరణార్ధులుగా చేసేందుకు తాను అనుమతించనని దీదీ స్పష్టం చేశారు. మీ భూములు ఎవరైనా బలవంతంగా తీసుకుంటే ఆందోళన చేపట్టండి..మీ వెంట రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. వంద రోజుల పని కార్యక్రమం నిధులను కేంద్రం విడుదల చేయడం లేదని దీదీ ఆరోపించారు. రైతులకు కేంద్రం నుంచి ఎరువులు అందడం లేదని దుయ్యబట్టారు. ఈ విషయంలో కేంద్రానికి లేఖ కూడా రాశామని, కేంద్రం ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఎరువుల తయారీ చేపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాలకు చెందిన పేదలకు 4701కు పైగా భూమి పట్టాలను సీఎం మమతా బెనర్జీ అందచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)