ప్రియురాలి హత్య ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 20 November 2022

ప్రియురాలి హత్య !


ఉత్తరప్రదేశ్ లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో ప్రియురాలిని ప్రియుడు గొంతు నులిమి చంపాడు. అనంతరం ఆమె శరీరాన్ని ఆరు భాగాలుగా కోసి బావిలో పడేశాడు. ప్రిన్స్‌ యాదవ్‌ అనే యువకుడు 20 ఏళ్ల వయసున్న ఆరాధనను ప్రేమించాడు. అయితే యువతి ఇతన్ని కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.  పెళ్లి అనంతరం కూడా యాదవ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన యాదవ్‌ తన తల్లిదండ్రులు, బంధువు సర్వేశ్‌, ఇతర బంధువులతో కలిసి ఆమెను అంతమొందించేందుకు ప్లాన్‌వేవాడు. మాట్లాడాలని చెప్పి నవంబర్‌ 9న ఆరాధనను బైక్‌పై గుడికి తీసుకెళ్లి సర్వేష్ సహాయంతో చెరకు తోటలో ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆమె మృతదేహాన్ని ఆరు భాగాలుగా నరికి పాలిథిన్ సంచిలో వేసి కొంత దూరంలో బావిలో పడేశారు. నవంబర్‌ 15న పశ్చిమి గ్రామం శివారులో ఉన్న బావిలో ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన యువతిని ఆరాధనగా గుర్తించారు. ఆమె సెల్‌ఫోన్‌ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు ప్రిన్స్‌ యాదవ్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన మృతదేహాన్ని గుర్తించేంఉదకు నిందితుడిని పోలీసులు సంఘటన స్థలానికి తీసుకెళ్లారు. అ క్రమంలో యాదవ్‌ తప్పించుకునే ప్రయత్నంలో ఇంతకుముందే సదరు ప్రదేశంలో దాచిపెట్టిన పిస్టోల్‌తో పోలీసులపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు అతనిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడి కాలుకు బుల్లెట్‌ గాయమైంది. ఈ కేసులో ఇప్పటివరకు పదునైన ఆయుధం, కంట్రీ మేడ్ పిస్టల్, క్యాట్రిడ్జ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

No comments:

Post a Comment