కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న బాలుడు !

Telugu Lo Computer
0


ఢిల్లీ సరిహద్దుల్లో ఘజియాబాద్ లోని మురాద్ నగర్ ప్రాంతంలో ఆరవ్ రాఠీ అనే 11 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. గత శనివారం ఆరవ్ సైకిల్ మీద కూరగాయల కోసం సంతకు వెళ్లి తిరిగి ఇంటికొస్తున్నాడు. ఆ బాలుడి రాకను గమనించిన కొందరు దుండగులు అతడిని వెంబడించారు.  కొద్దిదూరం వెళ్లాక ఆ దుండగులు ఆ బాలుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా వ్యానులో ఎక్కించారు. ఆ వ్యాను కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఆ దండుగులు ఆ బాలుడి ఒంటిపై ఉన్న బట్టలు మొత్తం విప్పారు. అనంతరం ఆ బాలుడి బట్టలతో పాటు అతడి సైకిల్ ను రోడ్డు పక్కకు పడేశారు. అయితే ఈ క్రమంలోనే ఆ బాలుడు కాస్త తెలివిగా వ్యవహరించాడు. దుండగుడి చేతిని తన నోటి పళ్లతో గట్టిగా కోరికాడు. దీంతో  ఆ బాలుడిని వదిలేశాడు. వెంటనే ఆ బాలుడు ఆ వ్యాను నుంచి కిందకు దూకి అక్కడి నుంచి పరారరయ్యాడు. ఎట్టకేలకు ఆ బాలుడు తన ఇంటికి చేరుకున్నాడు. అనంతరం జరిగిన విషయంపై తన తల్లిదండ్రులకు వివరించాడు. వెంటనే స్పందించిన ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడిని విచారించడంతో వారి చేతిలో కత్తులు, గాజు సీసాలు ఉన్నాయని, నేను అరిస్తే నిన్ను, మీ అమ్మ గొంతు కోస్తామని బెదిరించారు. ఇదే కాకుండా నన్ను కిడ్నాప్ చేశాక, మా నాన్న నుంచి డబ్బులు డిమాండ్ చేయాలని కూడా వారు చర్చించుకున్నారని బాలుడు పోలీసులకు వివరించాడు. దీంతో ఆ చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న ఆ బాలుడి తెగువను చూసి పోలీసులు మెచ్చుకున్నారు. అనంతరం పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)