ఆఫ్తాబ్ కు నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షలకు కోర్టు అనుమతి !

Telugu Lo Computer
0


శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా కు డిసెంబరు 1న నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షలు చేసేందుకు ఢిల్లీలోని ఓ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఢిల్లీలోని రోహిణిలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కు తీసుకెళ్ళి ఈ పరీక్షలు చేసేందుకు ఢిల్లీ పోలీసులకు సాకేత్‌లోని కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ పోలీసుల వినతిని ఆమోదించింది. ఇదిలా వుండగా, ఢిల్లీలోని ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధా వాకర్‌కు చెందిన ఓ ఉంగరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉంగరాన్ని ఆఫ్తాబ్ తాను డేటింగ్ చేసిన మరొక మహిళకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారంతో సూరత్‌లో మాదక ద్రవ్యాల అమ్మకందారు ఫైజల్ మొమిన్‌ను అరెస్టు చేశారు. ఫైజల్, ఆఫ్తాబ్ మిత్రులని తెలుస్తోంది. శ్రద్ధా వాకర్‌ మృతదేహాన్ని ముక్కలు చేయడం కోసం ఉపయోగించిన మరొక కత్తిని పోలీసులు అడవిలో గుర్తించారు. ఆఫ్తాబ్‌కు రోహిణిలోని ఎఫ్ఎస్ఎల్‌లో సోమవారం పాలిగ్రాఫ్ టెస్ట్‌లు కొనసాగాయి. తీహార్ జైలు పీఆర్ఓ ధీరజ్ మాథుర్ మాట్లాడుతూ, ఆఫ్తాబ్‌ జైలుకు రాగానే వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అతనికి ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు. తీహార్ జైలు అధికారులకు వచ్చిన ఆదేశాల ప్రకారం ఆఫ్తాబ్‌కు నవంబరు 29న, డిసెంబరు 5న నార్కో, పాలిగ్రాఫ్ టెస్ట్‌లు జరుగుతాయి. ఈ హత్య కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలపై శని, ఆదివారాల్లో కూడా ఎఫ్ఎస్ఎల్ పరీక్షలు జరిగాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)