పంట నష్టపరిహారం కింద వచ్చింది రూపాయి డెభైఆరు పైసలు !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలో పంట బీమా విషయంలో రైతులకు చేదు అనుభవం ఎదురైంది. పీఎం ఫసల్ యోజన బీమా కింద కేవలం రూపాయల్లో పరిహారం అందింది. పర్బణి జిల్లా దశాల గ్రామంలో ఓ రైతు రెండు ఎకరాల్లో సోయాబీన్, కంది, శనగ పంటను సాగు చేయగా, బీమా డబ్బులు రూ. 455 తో పాటు రూ. 200 పంట నష్టం మదింపు చార్జీల కింద చెల్లించాడు. అయితే సెప్టెంబరులో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతినడంతో బీమాకు దరఖాస్తు చేసుకోగా బీమా సంస్థ రూ. 1.76 లను చేతిలో పెట్టింది. పంట సాగుకు పెట్టుబడి 25 వేలు అయింది. పరిహారం రూ. 27 వేలు వస్తుందని ఆశించగా రెండు రూపాయలు కూడా రాకపోవడంతో మూర్ఛపోయినంత పనైంది. ఇలాగే మరో రైతుకు రూ. 14.21 వచ్చింది. మరో పంటకు 1200 రాగా, ఇంకో పంటకు అసలే రాలేదు. కానీ ప్రీమియం మాత్రం ముందుగానే రూ. 1800 కట్టించుకున్నారు. ఈ పరిణామాలతో పంట బీమా పట్ల రైతులు విరక్తి చెందుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)