ట్రాక్టర్‌ను ఢీకొన్న గరుడ బస్సు - ముగ్గురి దుర్మరణం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 20 November 2022

ట్రాక్టర్‌ను ఢీకొన్న గరుడ బస్సు - ముగ్గురి దుర్మరణం


తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట మండలంలోని జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి వద్ద చెరకులోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి గరుడ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో 16 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారు. మియాపూర్‌ డిపోకు చెందిన గరుడ బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన ముగ్గురు బస్సులో ప్రయాణిస్తున్న వారే. మృతుల్లో డ్రైవర్‌, క్లీనర్‌, ఓ ప్రయాణికుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

No comments:

Post a Comment