ఉప ఎన్నికలలో బీజేపీ కి నాలుగు !

Telugu Lo Computer
0


ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించగా, ఆర్జేడీ, శివసేన, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కొక్క స్థానాన్ని గెల్చుకున్నాయి. బీహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్, మహారాష్ట్రలోని ఈస్ట్ అంథేరి, తెలంగాణలోని మునుగోడు, ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోకర్ణనాథ్, ఒడిశాలోని థామ్‌నగర్, హర్యానాలోని అదంపూర్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీహార్‌లో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో మోకామాలో ఆర్జేడీ నేత నీలమ్ దేవి..బీజేపీ అభ్యర్ధి సోనమ్ దేవిపై విజయం నమోదు చేశారు. అటు గోపాల్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్ధి కుసుమ్ దేవి..ఆర్జేడీ నేత ప్రసాద్ గుప్తాను ఓడించారు. మహారాష్ట్రలోని ఈస్ట్ అంథేరీలో శివసేన ఉద్ధవ్ థాక్రే గ్రూపుకు విజయం లభించింది. అంథేరీ ఈస్ట్ ఉపఎన్నికలో శివసేన ఉద్ధవ్ థాక్రే పార్టీ అభ్యర్ధి రుతుజా లట్కేకు 66 వేల ఓట్లు పోలయ్యాయి. ఇదే స్థానంలో నోటాకు ఏకంగా 12 వేల ఓట్లు నమోదయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్ గోలా గోకర్ణనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి అమన్ గిరి..ఎస్పీ అభ్యర్ధి వినయ్ తివారిపై 34 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక ఒడిశాలోని ధామ్‌నగర్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి సూర్యవంశీ సూరజ్..సమీప బిజూ జనతాదళ్ అభ్యర్ధిపై విజయం సాధించారు. ఇక హర్యానాలోని అదంపూర్ స్థానంలో బీజేపీ అభ్యర్ధి భవ్య బిశ్నోయి విజయం సాధించారు. తెలంగాణలోని మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి ప్రభాకర్ రెడ్డి..సమీప బీజేపీ అభ్యర్ధిపై దాదాపు 11 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఓ దశలో నువ్వా నేనా రీతిలో సాగిన పోటీలో టీఆర్ఎస్ క్రమంగా మెజార్టీ పెంచుకుంటూ వెళ్లింది. అటు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)