స్కూల్‌ టీచర్ శిక్షకు బాలిక మృతి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 6 November 2022

స్కూల్‌ టీచర్ శిక్షకు బాలిక మృతి


బెంగళూరు రామచంద్రాపురంలోని ఆర్డీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 9 ఏళ్ల బాలిక 4వ తరగతి చదువుతున్నది. శుక్రవారం స్కూల్‌ టీచర్‌ పనిష్‌మెంట్‌ ఇవ్వగా ఆ విద్యార్థిని కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ బాలిక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో స్కూల్‌ యాజమాన్యం ఆ బాలిక తల్లిదండ్రులకు ఈ సమాచారం ఇచ్చింది. దీంతో వారు బాలిక మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కాగా, బాలిక మరణంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. స్కూల్‌లో ఆమెకు శిక్ష విధించడంతో చనిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆ స్కూల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. ఆసుపత్రి వద్ద ఆరా తీయగా బాలిక శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్నారు. బాలిక అనుమానాస్పద మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

No comments:

Post a Comment