పెళ్లి కోసం పురుషుడిగా మారిన మహిళ

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని భరత్ పుర్ జిల్లా చెందిన మీరా కుంతల్ నాగ్లా మోతి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీ టీచర్ గా పని చేస్తోంది. అక్కడ విద్యార్ధినీలకు కబడ్డీలో శిక్షణ ఇస్తుండేది. ఈ క్రమంలో కల్పన అనే అమ్మాయితో మీరాకు స్నేహం ఏర్పడింది. మీరా జాతీయ స్థాయి ఛాంపియన్ కాగా కల్పన కూడా కబడ్డీలో మంచి గుర్తింపు పొందిన ప్లేయర్. దీంతో వారిద్దరు దాదాపు ఆరేళ్లపాటు బాగా స్నేహం చేశారు. 2016 నుంచి వారిద్దరు మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో 2018లో కల్పనకు తన ప్రేమ విషయాన్ని మీరా కుంతల్ తెలియజేసింది. దీంతో కల్పన కూడా మీరా ప్రేమను అంగీకరించింది. దీంతో వారిద్దరు పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యారు. విషయం తెలిసిన ఇరువురి కుటుంబ సభ్యులు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ఏంటని వారిద్దరిని నిలదీశారు. ఆ సమయంలో వారి పెళ్లి వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో మీరా కుంతల్ కి ఓ ఆలోచన వచ్చింది. పురుషుడి లక్షణాలు ఉన్న తనకు అమ్మాయిగా ఉండటమే అడ్డంకి కాబట్టి ఆపరేషన్ చేసుకుని పురుషుడిగా మారాలని నిర్ణయించుకుంది. మీరా కుంతల్ 2021 డిసెంబర్ 15న ఆపరేషన్ చేయించుకుంది. శస్త్ర చికిత్స జరుగుతున్న సమయంలో కల్పన, మీరా కుంతల్ వద్దనే ఉండి.. ఆమె బాగోగులు చూసుకుంది. లింగమార్పిడి అనంతరం మీరా కుంతల్ ఆరవ్ అనే పురుషుడిగా మారింది. తన విద్యార్ధిని కల్పనను పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుంది. కల్పన, ఆరవ్ పెళ్లిని ఎంతో ఘనంగా జరిపించారు. మీరా కుంతల్ అమ్మాయిలాగా పుట్టినప్పటికీ బాల్యం నుంచి పురుష లక్షణాలు ఉన్నాయని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. చూడటానికి అమ్మాయిలగా కనిపించినా..మీరాకు మాత్రం పురుషుల లక్షణాలు ఉన్నాయని,వారిలా జీవించాలని కోరుకునేదని ఆమె తండ్రి తెలిపాడు. ఓ మానసిక వైద్యుడిని సంప్రదించగా.. ఆమెకు జెండర్ డిస్ఫోరియా అనే వ్యాధి ఉందని నిర్ధారించారు. ఒక ఇంటర్వ్యూలో, మీరా మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి తాను ఎప్పుడూ అబ్బాయిలాగే భావించానని, అందుకే లింగమార్పిడి నిర్ణయం సరైనది భావించినట్లు తెలిపింది. మీరా 2019 నుండి ప్రారంభమయ్యే వరుస శస్త్రచికిత్సల ద్వారా 2021 డిసెంబర్ నాటికి తన లింగమార్పి ఆపరేషన్ పూర్తి చేసుసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)