అండర్-16 టోర్నీలో 165 బంతుల్లో 407 పరుగులు !

Telugu Lo Computer
0


కర్ణాటకకు చెందిన తన్మయ్ మంజునాథ్. కర్ణాటక క్రికెట్ సంఘం అండర్-16 టోర్నీలో చెలరేగి చరిత్ర సృష్టించాడు. 50 ఓవర్ల మ్యాచ్ లో కేవలం 165 బంతుల్లోనే ఏకంగా 48 ఫోర్లు, 24 సిక్సులతో 407 పరుగులు చేసి వన్డే మ్యాచ్‌లో అద్భుతం చేసి చూపించాడు. ఆదివారం సాగర్‌ క్రికెట్‌ క్లబ్‌-భద్రావతి ఎన్టీసీసీ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో తన్మయ్‌ మంజునాథ్‌ సాగర్‌ క్రికెట్‌ క్లబ్‌ తరఫున బరిలోకి దిగాడు. దిగిదిగడంతోనే భద్రావతి బౌలర్ల భరతం పట్టాడు. కొడితే సిక్స్‌ లేదంటే ఫోర్‌ అనే విధంగా బ్యాటింగ్‌ చేస్తూ ఇంతవరకూ కనివినీ ఎరుగని రికార్డును నమోదు చేశాడు. మంజునాథ్‌ కర్ణాటకలోని శిమమొగ్గా ప్రాంతానికి చెందిన వాడు. సాగర్‌ క్రికెట్‌ క్లబ్‌ తరఫున అండర్‌ 16 పోటీల్లో పాల్గొంటున్నాడు. కాగా 2014 నవంబర్‌ 13న శ్రీలంక-భారత్‌ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో రోహిత్‌ శర్మ వన్డేల్లో ఏకంగా 264 పరుగులు బాదేసి.. ప్రపంచ క్రికెట్‌ నివ్వెరపోయేలా చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై రోహిత్‌ సృష్టించిన సునామీ ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డుగా ఉండిపోయింది. రోహిత్‌ సునామీకి సరిగ్గా 8 ఏళ్లు పూర్తయిన రోజునే మంజునాథ్‌ వన్డే మ్యాచ్‌లో ఏకంగా 407 పరుగులు బాదేసి మరో వరల్డ్‌ రికార్డును నమోదు చేశాడు. ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌లో మంజునాథ్‌ పేరు మార్మోగిపోతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)