కౌగిలింతల వైద్యం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 14 November 2022

కౌగిలింతల వైద్యం !


ఆస్ట్రేలియాకు చెందిన 42ఏళ్ల మిస్సీ రాబిన్సన్ అనే మహిళ మానసిక ఆరోగ్య కార్యకర్త, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి తనవంతు సహాయం చేయాలని భావిస్తోంది. ఈ ఆలోచనతోనే ఈమె కడెల్ థెరపీని ప్రారంబించారు.  ఇలా చేసినందుకు గానూ ఈమె గంటకు 12 వేల రూపాయలు వసూలు చేస్తుంది. మగవారు సర్వసాధారణంగా ఆడవారిలాగా తమ భావోద్వేగాలను త్వరగా బయటకు వ్యక్తపరచలేరు. తమలో తామే కుమిలిపోతూ పైకి విసుగు, చిరాకు వంటివాటిని ఎక్స్ ప్రెస్ చేస్తారు. కారణం ఏదైనా మానసికంగా డిస్ట్రబ్ అయినపుడు మగవారు కాసింత ఓదార్పు కోరుకుంటారు. అయితే ఆ సమయంలో వారికి ఓ వెచ్చటి హగ్ ఇవ్వడం ద్వారా వాటింన్నింటిని మరచిపోయి ఎంతో సంతోషంగా పనిచేయగలుగుతారట. ఈ విషయాన్ని వైద్య నిపుణులు కూడా వెల్లడించారు. ఈ విధంగా కౌగిలి అనేది గొప్ప ఔషదంలాగా పనిచేస్తుందన్నమాట. అలాంటి మానసికంగా డిస్ట్రబ్ అయిన వాళ్శకు మిస్సీ మంచి ఆప్షన్ గా మారింది. కస్టమర్ లు కూడా ఆమెను బాగానే అప్రోచ్ అవుతున్నారు. ఒక్కో కస్టమర్ గంట నుండి వారికి నచ్చినంత సమయం వారిని కౌగిలించుకుని సమయానికి తగిన మొత్తాన్ని ఆమె వారి నుండి తీసుకుంటుంది. ఇది కూడా ఓ రకమైన థెరపీ అని చెబుతున్న మిస్సీ ఆస్ట్రేలియా మానసిక ఆరోగ్యసంస్థకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇలా మానసికంగా ఇబ్బంది పడుతున్నవారికి సహాయం చెయ్యడమే తన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.

No comments:

Post a Comment