ఉపాధి కోల్పోయిన టెకీలకు డ్రీమ్ 11 ఆఫర్ !

Telugu Lo Computer
0


ప్రముఖ కంపెనీలైన ట్విటర్, మెటా, పేస్ బుక్, అసెంచర్, కాంగ్నిజెంట్ ఇటీవల పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. యాపిల్, అమెజాన్ అల్ఫాబెట్ వంటి దిగ్గజ సంస్థలో నియామక ప్రక్రియ నెమ్మదించింది. ఈ క్రమంలో అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బి వీసాదారులు 60 రోజుల్లోగా మరో ఉద్యోగం చూసుకోవాల్సి పరిస్థితి ఉంది. వారి ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ను కొనసాగించాలంటే వారు తప్పక జాబ్ పొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అలాంటి వారికి డ్రీమ్ 11 ఆఫర్ వరంలా దొరికింది. హరీశ్ జైన్ ఇచ్చిన ఆఫర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. డ్రీమ్ 11 సహ వ్యవస్థాపకుడు హరీశ్ జైన్ మాట్లాడుతూ.. “అమెరికాలో ఈ ఏడాది టెక్ సంస్ధల్లో 52 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారిలో భారతీయులు ఉంటే స్వదేశానికి తిరిగి రండి. ముఖ్యంగా వీసా సమస్యలు ఉన్నవారు ఇండియాకు వచ్చి ఇక్కడ ఐటీ రంగ అభివృద్ధికి పాటుపడండి. రాబోయే కాలంలో భారత్ టెక్ రంగంలో భారీ వృద్ధికి అవకాశం ఉంది. మా సంస్థ కూడా ఆర్ధికంగా సుస్థిరంగా ఉంది. మా సంస్థలోని జాబ్ మీ అర్హతలకు తగినదని భావిస్తే సంకోచం లేకుండా సంప్రదించండి. ప్రొడక్ట్, డిజైనింగ్ ప్రొడక్ట్ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారి కోసం మేం ఎదురు చూస్తున్నాం” అని జైన్ ట్వీట్టర్ లో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)