పెళ్లి పేరు తో యువతిని నమ్మించి మోసం !

Telugu Lo Computer
0


చెన్నైలోని వెస్ట్‌ మాంబళం ప్రాంతానికి చెందిన ఓ యువ పట్టభద్రురాలు ప్రముఖ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఈమెకు ఎంజీఆర్‌ నగర్‌ సమీపంలోని జాపర్‌ఖాన్‌ పేట ప్రాంతానికి చెందిన డాక్టర్‌ మనోజ్‌ చార్లెస్‌తో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ స్థితిలో చార్లెస్‌ 'నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను' అంటూ యువతి నుంచి డబ్బులు డిమాండ్‌ చేశాడు. ఆ యువతి వద్ద నుంచి కొంచెం కొంచెంగా ఇప్పటి వరకు రూ. 60 లక్షలు తీసుకున్నాడు. తీరా చార్లెస్‌ ఆ యువతిని పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడు. ఈ విషయమై ఆమె చార్లెస్‌ను ప్రశ్నంచగా అడిగితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన యువతి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వైద్యుడిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అశోక్‌నగర్‌ ఆల్‌ మహిళా పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ మేరకు మోసం సహా 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మనోజ్‌ చార్లెస్‌ను అరెస్టు చేసి, జైలుకు తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)