వివిధ కారణాల రీత్యా 114 రైళ్ల రద్దు

Telugu Lo Computer
0


వివిధ కారణాల వల్ల ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సోమవారం నాడు 114 రైళ్లను రద్దు చేసింది. రైల్వే ట్రాక్‌లపై నిర్వహణ పనుల కారణంగా సోమవారం నాడు 43 రైళ్లు పాక్షికంగా రద్దు చేశారు. సోమవారం ఇండియన్ రైల్వేశాఖ సోమవారం కూడా పలు రైళ్లను దారి మళ్లించింది. కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది. వివిధ కారణాల వల్ల నవంబర్ 22వతేదీన కూడా పలు రైళ్లను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రయాణికులు తమ రైలు ప్రయాణాలకు బయలుదేరే ముందు తమ రైళ్ల స్థితిని రైల్వే వెబ్ సైట్లో తనిఖీ చేయాలని రైల్వే అధికారులు సూచించారు. పఠాన్‌కోట్, మొరాదాబాద్, బీనా, న్యూఢిల్లీ, కన్యాకుమారి, కొల్లాం, ప్రతాప్‌నగర్, ముంబై, పూణే, హౌరా, సీల్దా, అహ్మదాబాద్, చందన్‌పూర్ నగరాల నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు.రద్దు అయిన రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల టికెట్లు రద్దు చేసి రీఫండ్ ఇస్తామని రైల్వే అధికారులు చెప్పారు.రైళ్లలో ప్రకృతి వైపరీత్యాలు, రైళ్లు పట్టాలు తప్పడం వంటి వివిధ కారణాల వల్ల భారతీయ రైల్వే ప్రతిరోజూ రైళ్ల సేవలను రద్దు చేస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)