ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులలో క్యూఆర్​ కోడ్​తో ఓపీ రిజిస్ట్రేషన్ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 7 October 2022

ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులలో క్యూఆర్​ కోడ్​తో ఓపీ రిజిస్ట్రేషన్


ప్రభుత్వ ఆస్పత్రులలో ఔట్​ పేషెంట్​ల కోసం నేషనల్​ హెల్త్​ అథారిటీ (ఎన్​హెచ్​ఏ) ఓపీ రిజిస్ట్రేషన్​ను మరింత సులభంగా మార్చేసేందుకు క్యూఆర్​ కోడ్​ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలోని రెండు ప్రభుత్వ ఆస్పత్రులలో సూపర్​ఫాస్ట్​ ఓపీడీ రిజిస్ట్రేషన్​ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హాస్పిటల్​ కౌంటర్​లో ఉన్న క్యూఆర్​ కోడ్​ స్కాన్​ చేసి, పేషంట్​ పేరు, తండ్రి పేరు తదితర వివరాలతో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. కొన్ని నిమిషాల్లో అదే ఫోన్​కు ఓ టోకెన్​ నంబర్​ వస్తుంది. ఆ నంబర్​ కౌంటర్​ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్​ డిస్​ప్లేలో కూడా కనిపిస్తుంది. ఆ టైంలో పేషంట్​ డైరెక్ట్​గా కౌంటర్​ వద్దకు వెళ్లి డాక్టర్​ కన్సల్టేషన్​ కోసం ఔట్​పేషంట్​ స్లిప్​ తీసుకోవచ్చు. క్యూఆర్​ కోడ్​ను ఫోన్​ కెమెరా, ఏబీహెచ్​ఏ, ఆరోగ్య సేతులాంటి యాప్​ ద్వారా స్కాన్​ చేయాల్సి ఉంటుంది. ఆయుష్మాన్​ భారత్​ డిజిటల్​ మిషన్ (ఏబీడీఎ)లో భాగంగా ఎన్​హెచ్ఏ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పైలట్​ ప్రాజెక్టులో భాగంగా లేడీ హార్డింగ్​మెడికల్​ కాలేజీ(ఎల్​హెచ్​ఎంసీ), శ్రీమతి సుచిత క్రిప్లానీ హాస్పిటల్(ఎస్​ఎస్​కేహెచ్)లోని ఓపీ డిపార్ట్​మెంట్స్​లో ఈ క్యూఆర్​ కోడ్​లను ఇన్​స్టాల్​ చేశారు. స్మార్ట్​ ఓపీడీ రిజిస్ట్రేషన్​ సేవలు మెరుగైన ఫలితాలిస్తే.. మరిన్ని ఆస్పత్రులలో అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్​హెచ్​ఏ సీఈవో డాక్టర్​ ఆర్​ఎస్​ శర్మ తెలిపారు. వైద్యసేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు. 15 రోజుల్లో 2,200 మందికి పైగా పేషంట్స్​ ఈ సేవలను పొందినట్టు తెలిపారు.

No comments:

Post a Comment