వైమానిక దళంలో వెపన్ సిస్టమ్ బ్రాంచ్ !

Telugu Lo Computer
0


వైమానిక దళంలో ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం వెపన్ సిస్టమ్ బ్రాంచ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరీ తెలిపారు. భారత వైమానిక దళం 90వ వార్సికోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇది చరిత్రాత్మకమైన సందర్భమని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐఏఎఫ్‌లో ఆపరేషన్ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. వెపన్ సిస్టమ్ శాఖ వల్ల ఫ్లయింగ్ శిక్షణ కోసం అయ్యే ఖర్చుల్లో సుమారు రూ.3400 కోట్లను ఆదా చేయవచ్చు అని చౌదరీ తెలిపారు. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా వైమానిక దళంలోకి ఎయిర్ వారియర్లను ర్రికూట్ చేయడం ఓ పెద్ద సవాల్ అన్నారు. కానీ దేశంలోని యువత సామర్థ్యాన్ని గుర్తించి, వారిని దేశ సేవ కోసం వినియోగించుకోవాలని చెప్పారు. అగ్నివీరుల శిక్షణ విధానాన్ని మార్చామని తెలిపారు. ఐఏఎఫ్‌లో కెరీర్‌ను కొనసాగించేందుకు తగిన రీతిలో వారిని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)