వికేంద్రీకరణ ఉద్యమం ఉధృతం చేస్తాం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఓ అజెండా ప్రకారం చంద్రబాబు చెప్పినట్లుగా అమరావతి రైతులు చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. టీడీపీ నేతలు ఓ దురుద్దేశంతో చేయిస్తున్న పాదయాత్రలా కనిపిస్తోందని.. కొంతమంది పెట్టుబడిదారులు వెనుక ఉండి నడిపిస్తున్నారని విమర్శలు చేశారు. వికేంద్రీకరణ అనేది ప్రజల ఆకాంక్ష అని, రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణ సీరియస్‌నెస్ చెప్పడానికే ఓ ఎమ్మెల్యే రాజీనామా చేసి ఉండవచ్చన్నారు. వికేంద్రీకరణపై ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉందన్నారు. ఓ ప్రాంతానికి సంబంధించిన సెంటిమెంట్ కోసం పెట్టిన పార్టీ టీఆర్ఎస్ అని, ఇప్పుడు వాళ్లు దేశం మొత్తం పోటీ చేస్తామంటే వారిష్టం అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాజధాని విషయంలో టీడీపీ నేతలు రైతులను రెచ్చగొట్టి నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని రైతులకు గత ప్రభుత్వం కన్నా తాము ఎక్కువ కౌలు ఇస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం చేసిన తప్పేంటో రైతులు చెప్పాలన్నారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన ల్యాండ్ పూలింగ్ వల్లే ఇబ్బందులు వచ్చాయన్నారు. అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశామని, సీఎం జగన్ తీసుకువచ్చిన వికేంద్రీకరణ పరిపాలనను రాష్ట్ర ప్రజలు ఆమోదించారన్నారు. ఏపీలో మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నిరుపేదలకు ఇళ్లు కట్టి ఇచ్చేందుకు 2023 ఫిబ్రవరి టార్గెట్‌గా పెట్టుకుని కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తరహాలో గ్రాఫిక్స్‌లో కాకుండా తాము విజన్‌తో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)