గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కిన ఆ శునకం మృతి

Telugu Lo Computer
0


ప్రపంచంలోనే అతి ఎక్కువ వయసున్న కుక్కగా గిన్నిస్ రికార్డ్‌కు ఎక్కిన శునకం కన్నుమూసింది. ఫాక్స్ టెర్రియర్ జాతికి చెందిన ఈ శునకం గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకారం 22 సంవత్సరాల ఏడు నెలలు బతికింది. వయస్సు మీద పడడంతో సౌత్ కరోలినాలోని టేలర్స్‌లో తన యాజమానుల ఇంట్లోనే సహజంగా మరణించింది. పెబుల్స్‌గా పిలుచుకుంటున్న ఈ శునకం న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో మార్చి 28, 2000న జన్మించిందట!. ఆ కుక్క యజమానులు బాబీ, జూలీ గ్రెగొరీల జంట..దానికి పెబుల్స్‌గా పేరు పెట్టారు. పెబుల్స్ మరణం పట్ల దాని యజమానురాలు జూలీ మాట్లాడుతూ పెబుల్స్ తన జీవితం కాలంలో మొత్తం 32 కుక్క పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం, చాలా ప్రేమ, సంరక్షణ ఇవ్వడం వల్లె పెబుల్స్ ఎక్కువ కాలం బతికిందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)