మయన్మార్‌లో సైనిక పాలకుల అరాచకం !

Telugu Lo Computer
0


మయన్మార్ లో సైనిక పాలనను వ్యతిరేకించినందుకు ఉపాధ్యాయుడి తల నరికేశారు. మయన్మార్ గ్రామీణ ప్రాంతం అయిన మాగ్వే ప్రాంతంలో తౌంట్ మైంట్ గ్రామంలో 46 ఏళ్ల సా తున్ మో అనే గణిత ఉపాధ్యాయుడి తల నరికి  తలను పాఠశాల గేటుకు వేలాడదీశారు. గతేడాది మూతపడిన ఈ పాఠశాలను కాల్చేశారు.  గతేడాది ఫిబ్రవరిలో మయన్మార్ లో సైనిక తిరుగుబాటు జరిగింది. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అధికారాన్ని చేపట్టింది. రాజధాని నేపితాను ఆధీనంలోకి తీసుకుని ఆంగ్ సాంగ్ తో పాటు పలువురు రాజకీయ నాయకులను జైల్లలో నిర్భంధించారు. 2300 మంది పౌరులను చంపినట్లు సైన్యంపై ఆరోపణలు ఉన్నాయి. సైన్యం పాలనను వ్యతిరేకించిన వారిని దారుణంగా అణిచివేసింది. సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ విద్యా సిబ్బందిపై 260 దాడులు జరిగాయని యూఎన్ బాలల హక్కుల కమిటీ వెల్లడించింది. హత్యకు గురైన సా తున్ మో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఆదివారం ఆయన స్థానికంగా ఉన్న వేరుశెనెగ పంటలో దాక్కున్నా సైన్యం వదిలిపెట్టకుండా వెతికిపట్టుకుని మరీ చంపింది

Post a Comment

0Comments

Post a Comment (0)