హిమాచల్‌ప్రదేశ్‌లో కాషాయానికి ఎదురుగాలి !

Telugu Lo Computer
0


హిమాచల్‌ప్రదేశ్‌లో కాషాయ పార్టీని గద్దె దించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తున్నది. పంజాబ్‌ విజయంతో జోరు మీదున్న ఆమ్‌ ఆద్మీపార్టీ ఇక్కడ కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నది. రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాయాలని బీజేపీ తహతహలాడుతుంది.  దీంతో హిమాచల్‌లో ముక్కోణపు పోటీ కనిపిస్తున్నది. ఈ ముక్కోణపు పోటీలో బీజేపీ ఓటమి కాయమని వార్తలొస్తున్నాయి. హిమాచల్‌లో 1985 నుంచి ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. అయితే ఈసారి తిరిగి అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నా ప్రజలు బీజేపీపై వ్యతిరేకతతో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే బీజేపీ పాలనపై అన్ని వర్గాల వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలెండర్లు ఫ్రీగా ఇస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు పన్ను రద్దు చేస్తామని ప్రకటించారు. ఉచితాలకు వ్యతిరేకమంటూ ప్రచారం చేసుకునే బీజేపీ ఇక్కడ మాత్రం ఉచితాలు ప్రకటించడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)