ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 12 October 2022

ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం !


కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నాలాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కేఆర్ పురంలోని ఎస్ఆర్ లే అవుట్‌లో అక్రమ కట్టడాలను కూల్చేసేందుకు బృహత్ బెంగళూరు మహానగర్ పాలిక అధికారులు చేరుకున్నారు. అక్కడ నిర్మించిన ఓ అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు బుల్డోజర్ వచ్చింది. దీంతో ఆ ఇంటి దంపతులు సునీల్ సింగ్, సోనా సేన్ కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. ఇక సోనా సేన్ అగ్గిపుల్ల కూడా వెలిగించింది. కానీ అదృష్టవశాత్తు ఆ అగ్గిపుల్ల వెలగలేదు. అప్పటికే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు కలిసి వారిపై నీళ్లు గుమ్మరించి, ప్రాణాలతో కాపాడారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సునీల్ సింగ్, సోనా సేన్ మాట్లాడుతూ తమ ఇంటిని అక్రమంగా నిర్మించుకోలేదన్నారు. తమ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు, పోలీసులు వినిపించుకోకుండా ఇంటిని కూల్చేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.

No comments:

Post a Comment