బలి ఇచ్చి మాంసాన్ని తిన్న నిందితులు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 12 October 2022

బలి ఇచ్చి మాంసాన్ని తిన్న నిందితులు


కేరళ నరబలి కేసులో నివ్వెరపోయే నిజాలు వింటే వెన్నులోంచి వణుకు పుడుతుంది. నరబలి ఇవ్వటమే కాకుండా మృతదేహాలను ముక్కలు ముక్కలుగా చేసిన ఆ మాంసాన్ని తినేసారు. ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసి వారిని అత్యంత దారుణం హింసించి మరీ బలి ఇచ్చారు. తలపై సుత్తితో మోది అంత్యంత పాశవికంగా హత్య (బలి) చేశారు. కేరళలోనే కాకుండా ఈ నరబలి సంఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. గతంలో ట్రక్ డ్రైవర్ గా పనిచేసిన మహ్మద్ షఫీ అనే వ్యక్తి శ్రీదేవి అనే పేరుతో తిరువళ్లకు చెందిన భగవంత్ సింగ్ దంతపులకు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. వీరు చాటింగ్ చేసుకునేవారు. అలా భగవంత్ సింగ్-లైలా దంపతులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న షఫీ వారికి ఎన్నో మాయమాటలు చెప్పాడు. చివరకు తను అసలు పేరు షఫీ అని తెలిపాడు. నరబలి ఇస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మించాడు. అసలు ఆర్థిక బాధల్లో ఉన్న దంపతులు షఫీ మాటలు నమ్మారు. అలా షఫీ భగవంత్ సింగ్ ఇంటికి వచ్చాడు. అలా ముగ్గురు కలిసి మాట్లాడుకుని నరబలి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తమకు డబ్బు ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని చెప్పాడు. అలా వారి బలహీనతను ఆసరాగా చేసుకున్న ఫషీ అత్యంత దారుణాలు చేశాడు. దాంట్లో భాగంగానే పూజల పేరుతో భగవంత్ సింగ్ కళ్లముందే అతని భార్య లైలాపై అత్యాచారం చేశాడు. అయినా భగవంత్ సింగ్ దంతపులు షఫీకి సహకరించారు. ఈ క్రమంలో షఫీ ఎర్నాకుళంలో లాటరీలు అమ్మే మహిళలను, సెక్స్ వర్కర్లను సంప్రదించాడు. ఈక్రమంలో లాటరీ టికెట్లు అమ్మే కడవంతర, కాలనీలకు చెందిన రోజ్లీని 10 లక్షలు ఇస్తానని నమ్మించి జూన్ 6న తన వెంట షఫీ తీసుకెళ్లాడు. అలా రోజ్లీని అత్యంత దారుణంగా హత్య చేసిన లైలా ఆమె మృతదేహాన్ని ఐదు భాగాలుగా కోసింది. ఆ తరువాత శరీరభాగాలను తింటే అదృష్టం వరిస్తుందని చెప్పాడు షఫీ. అలా ఆ శరీరభాగాల్లో కొన్నింటిని ముగ్గురు కలిసి తిన్నారు. ఆ తతంగం గడిచి నెలలు గడిచింది. కానీ తమకు ఎటువంటి అదృష్టం దక్కలేదని షఫీని నిలదీశారు లైలా దంపతులు. దీంతో ఫషీ మరొక బలి ఇస్తేనే అదృష్టం వరిస్తుందని చెప్పారు. ఇలా పద్మం అనే మరో మహిళను తన వెంట వస్తే రూ.10లక్షలు ఇస్తానని మాయమాటలు చెప్పి తీసుకొచ్చాడు షఫీ. అలా పద్మంను సెప్టెంబర్ 26న తీసుకొచ్చి ఆమెన కూడా అత్యంత దారుణంగా చంపేశారు.అలా 24 గంటల్లోనే షఫీ, భగవంత్ మాల్ సింగ్, లైలాలు అత్యంత దారుణంగా హింసించి బలి ఇచ్చారు. మంచానికి కట్టేసి సుత్తితో తలపై బాది అత్యంత పాశవికంగా చంపేశారు. వారిని ఎంత దారుణంగా చంపితే అదృష్టం అంతగా వస్తుందని లైలాకు చెప్పాడు. దీంతో లైలా వారిని అత్యంత దారుణంగా సుత్తితో మోదింది. ఆతరువాత షఫీ వారిపై కూర్చుని గొంతులు కోసి చంపేశాడు. ఫఫీ చెప్పినట్లల్లా చేసిన లైలా రోజ్లీ, పద్మం ప్రైవైటు పార్టులను తీవ్రంగా గాయపరిచి ఆ రక్తాన్ని ఇల్లంతా చల్లింది. తరువాత మృతదేహాన్ని ముక్కలుగా కోసారు. రోజ్లీ మృతదేహాన్ని 5 బాగాలుగా కోయగా..పద్మం మృతదేహాన్ని 56 భాగాలుగా కోసారు. అదే ఇంట్లో అండర్ గ్రౌండ్ లో పాతిపెట్టారు.    పద్మం కుమారుడు తన తల్లి కనిపించటంలేదని పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటంతో రంగంలోకి దిగిన పోలీసులకు ఈ నరబలి దారుణ ఘటన గురించి బయటపడింది. రెస్లీనీ 56 ముక్కులుగా.పద్మను  ఐదు ముక్కలు చేశారు భగవత్ సింగ్ దంపతులు, ఎంజెంట్ మహ్మద్ షఫీ. ఇక ఆ ఇద్దరిని చంపిన అనంతరం వారి శరీరాన్ని తిన్నారు. జూన్ 8 మరియు సెప్టెంబరు 26న సాయంత్రం 5-6 గంటల సమయంలో నరబలి ఇచ్చారు. కాగా నరబలి నింధితులకు 14 రోజులు పాటు రిమాండ్ విధించింది కోర్టు.  నరబలి ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్  త్వరగతినా కేసును విచారణ చేపట్టాని ఆదేశాలు జారీ చేశారు.

No comments:

Post a Comment