తగ్గిన స్టీల్ ధరలు !

Telugu Lo Computer
0


గత ఆరు నెలల కాలంలో స్టీల్ ధర ఊహించని స్థాయిలో తగ్గినట్లు స్టీల్‌మింట్‌ వెల్లడించింది. ఈ క్రమంలో స్టీల్ ధర 40 శాతం పతనం తర్వాత ప్రస్తుతం రూ.57,000 స్థాయిలో ఉంది. అధిక ద్రవ్యోల్బణం వల్ల మందగించిన రియల్టీ రంగంలో ధరల తరుగుదల కొత్త జోష్ నింపుతోంది. ఖరీదు తగ్గించుకుని వేగంగా నిర్మాణాలను చేసేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారు. ఏప్రిల్‌-2022 ప్రారంభంలో స్టీల్‌ ధర టన్నుకు రూ.78,800గా ఉంది. దీనిపై 18 శాతం జీఎస్టీని కలుపుకుంటే ఆ ధర రూ.93,000కు చేరుకుంది. ఈ ఏడాది ఇదే ఆల్ టైం హై రేటు. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన స్టీల్ జూన్ చివరి నాటికి టన్ను ధర రూ.60,200కు చేరుకుంది. అయితే ప్రస్తుతం ఈ ధర మరింత తగ్గి టన్ను రూ.52,000 వద్దకు వచ్చింది. మే 21న కేంద్ర ప్రభుత్వం ఐరన్ ఓర్ ఎగుమతులపై 50 శాతం, ఇతర స్టీల్‌ ఉత్పత్తులపై 15 శాతం టాక్స్ విధించింది. అలాగే స్టీల్‌ పరిశ్రమలో ఉపయోగించే కోకింగ్‌ కోల్‌, ఫెర్రోనికెల్‌ దిగుమతులపై కూడా సుంకం విధించింది. దేశంలో సరఫరా పెంచి ధరలను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19, 2022న తెలంగాణలోని హైదరాబాద్ లో టన్ను స్టీల్ ధర రూ.56,500గా ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉక్కు వినియోగం భారీగా తగ్గిపోవటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో చీకచి సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా చైనా, యూరప్ ఆర్థిక వ్యవస్థల్లో నెమ్మదించటం వల్ల స్టీల్ డిమాండ్ తగ్గుతుందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ తెలిపింది. 2022లో ఇది 2.3 శాతం తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో చైనా ఉక్కు వినియోగం 4 శాతం తగ్గుతుందని నివేదికలో వెల్లడించింది. వచ్చే ఏడాది రష్యా ఉక్కు వినియోగం 10 శాతం పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)