డోప్ టెస్టులో పట్టుబడ్డ టెన్నిస్ స్టార్ సిమోనా హలెప్ !

Telugu Lo Computer
0


రొమేనియా టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి సిమోనా హలెప్ డోపింగ్ టెస్టులో పట్టుబడింది. దీంతో అంతర్జాతీయ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజేన్సీ (ఐటీఐఏ) ఆమెపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినందుకు ఆమె కెరీర్ ప్రమాదంలో పడింది. ఈ ఏడాది న్యూయార్క్ లో జరిగిన యూఎస్ ఓపెన్ సమయంలో హలెప్ నుంచి సేకరించిన రెండు శాంపిల్స్ ను పరీక్షించి ఆమె డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు గుర్తించారు. ఆమె శాంపిల్స్ లో రోక్సాడుస్టాట్(ఎఫ్ జీ 4592) అనే డ్రగ్ ఉన్నట్టు తేలింది. కాగా 2022లో ఈ డ్రగ్ ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ నిషేధిత జాబితాలో ఉంది. ఈ క్రమంలోనే టెన్నిస్ యాంటీ డోపింగ్ ప్రోగ్రాం(టిఏడీపీ) ఆర్టికల్ 7.12.1 ప్రకారం హలెప్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు ఐటీఐఏ ధ్రువీకరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)