మొక్కజొన్న పొత్తు - జాగ్రత్తలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 8 October 2022

మొక్కజొన్న పొత్తు - జాగ్రత్తలు !


మొక్కజొన్న చాలా ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ, రోడ్డు పక్కన విక్రయించే కాల్చిన మొక్కజొన్న తినడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీకు తెలుసా? ఈ హెల్త్ వార్నింగ్ అలవాటు ఎంత ప్రమాదకరమో తెలుసా? చాలా మంది ప్రజలు మొక్కజొన్న పొత్తులను కాల్చి, రోడ్డు పక్కన, నేరుగా పొయ్యి నుండి కొనుగోలు చేసి తింటుంటారు. ఎందుకంటే..దాని వాసన మనల్ని ఆకర్షిస్తుంది. మొక్కజొన్న ఆరోగ్య పరంగా చూస్తే.. పోషకాల నిధిగా పరిగణించబడుతుంది. అలాంటి మొక్కజొన్నను ఎక్కడ పడితే అక్కడ తినేస్తే.. అది అనర్థాలకు దారి తీస్తుంది. రోడ్డు పక్కన ఉన్న మొక్కజొన్నలను అనుకోకుండా కూడా తినకండి. ఈగలు వాలినవి తింటే మీ ఆరోగ్యం పాడవుతుంది. రోడ్డు పక్కన విక్రయించే మొక్కజొన్నను ఎక్కువగా బహిరంగ ప్రదేశంలో ఉంచుతారు. దాంతో వాటిపై ఈగలు వాలి కలుషితం చేస్తుంటాయి. దీంతో మొక్కజొన్నలో అనేక బ్యాక్టీరియాలు, క్రిములు పెరుగుతాయి. తక్కువ ధరకు వస్తున్నాయని, లేదంటే, రోడ్డు పక్కన కాల్చిన మొక్కజొన్న సువాసన ఆకలి పుట్టించే కారణంగా మీరు రోడ్డు పక్కన అటువంటి అనారోగ్యకరమైన మొక్కజొన్న తింటే, మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొక తప్పదు. అలాంటి మొక్కజొన్న తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది.. కాబట్టి వీధి దుకాణాలు, మురికి ప్రాంతాల్లోని దుకాణాల నుండి కొనుగోలు చేయరాదు. రోడ్డు పక్కన ఉన్న మొక్కజొన్న పొత్తులపై రోజంతా తెరిచి ఉంచడం వల్ల వాటిపై దుమ్ము పడుతూనే ఉంటుంది. మీరు అలాంటి మొక్కజొన్న తిన్నప్పుడు ఈ కణాలు మీ శరీరంలోకి ప్రవేశించి మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి. కాబట్టి, రోడ్డు పక్కన బహిరంగంగా ఉంచిన మొక్కజొన్న తినకుండా ఉండాలి. మొక్కజొన్నలను కాల్చేందుకు ఉపయోగించే బొగ్గు, ఉడకబెట్టేందుకు ఉపయోగించే పాత్రలను శుభ్రం చేయడంలో కూడా కొందరు విక్రయదారులు శ్రద్ధ చూపడం లేదు. ఇది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది. అందుకే ఆరుబయట మొక్కజొన్న తినేటప్పుడు దీన్ని గుర్తుంచుకోండి. కాల్చిన మొక్కజొన్నలో నిమ్మరసం, మసాలా దినుసులు జోడించడం వల్ల రోడ్డు పక్కన మొక్కజొన్న రుచి పెరుగుతుంది. ఇదీ కాకుండా, మొక్కజొన్న విక్రయించే వారు చాలాసార్లు పాడైపోయిన, కిందపడిపోయిన నిమ్మకాయలను ఉపయోగించే అవకాశం ఉంది. అలా అయితే, కాల్చిన మొక్కజొన్న మీ ఆరోగ్యాన్ని కూడా కాల్చేస్తుందని మర్చిపోవద్దు.

No comments:

Post a Comment