రూపాయి విలువ ఆల్ టైం రికార్డు పతనం !

Telugu Lo Computer
0


అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైం రికార్డులో పతనమైంది. ఉదయం 82.33 వద్ద స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అయ్యింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూపాయి విలువ 16 పైసలు డౌన్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడం, స్వదేశీ మార్కెట్‌లో నెగటివ్ ట్రెండ్ వల్ల రూపాయి విలువ మరింతగా దిగజారిపోయింది. డాలర్‌తో పోలిస్తే జీవితకాలంలో అత్యంత కనిష్టానికి పడిపోయింది. ఉదయం 82.19 వద్ద రూపాయి ట్రేడింగ్ మొదలైంది. ఆ తర్వాత ఓ దశలో 82.33 కు ట్రేడింగ్ చేరుకున్నది. దీంతో గత రాత్రితో పోలిస్తే ట్రేడింగ్‌లో రూపాయి విలువ 16 పైసలు తగ్గినట్లు విశ్లేషకులు వెల్లడించారు. గురువారం తొలిసారి ట్రేడింగ్‌లో 82 కన్నా తక్కువగా క్లోజ్ అయ్యింది. చరిత్రలో తొలిసారిగా 82 మార్క్‌ దిగువకు పడిపోయింది. 55 పైసలు నష్టపోయి 82.17 వద్ద ముగిసింది. ఫారెక్స్‌మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలో 81.52 స్థాయి వద్ద రూపాయి సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో డాలరు బలపడటంతో స్థానిక కరెన్సీ క్రమేపీ క్షీణించింది. గత ట్రేడింగ్‌ రోజైన మంగళవారం రూపాయి 20 పైసలు పెరిగి 81.62 వద్ద ముగిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)