అనుకోని అతిథి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 6 October 2022

అనుకోని అతిథి !


మహారాష్ట్ర సతారా లోని, కోయానగర్‌లో నివసించే ఓ కుటుంబం గురువారం రాత్రి దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లింది. ఆ సమయంలో వారి ఇంట్లో ఓ చిరుతపులి చొరబడింది. నిమజ్జనం అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు గది తలుపులు తెరవగా ఓ రూమ్ తలుపు దగ్గర పులి కూర్చొని ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకున్న వారంతా బయటకు వచ్చి ఇంటి తలుపులు మూసివేశారు. విషయం తెలుసుకున్న ఆ ఊరిలోని వారంతా వచ్చారు. కిటీకీల నుంచి చిరుతను వీడియోలు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడి చేరుకున్నారు. చిరుతపులిని బోనులో బంధించి తీసుకువెళ్లారు.

No comments:

Post a Comment