కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి అరెస్టు

Telugu Lo Computer
0


ముంబాయిలోని కుంద్రా ప్రాంతంలో 17 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. తల్లిదండ్రులతో కలిసి ఆ అమ్మాయి కొంతకాలం సంతోషంగా జీవించింది. అనారోగ్యంతో తల్లి చనిపోవడంతో ఆ అమ్మాయికి కష్టాలు ఎదురైనాయి. తల్లి చనిపోయిన తరువాత అమ్మాయి తండ్రి మరో పెళ్లి చేసుకోలేదు. మద్యం మత్తులో  తండ్రి సొంత కూతురి మీద కన్ను వేశాడు. భోజనం పెడుతున్న కూతురిని ముట్టుకోవడం, ఎక్కడంటే అక్కడ చేతులు వెయ్యడం చేశాడు. వయసుకు వచ్చిన కూతురిని దగ్గరకు తీసుకుని అప్యాయంగా పలకరించే ముసుగులో ఆమెను శారీరకంగా వేధింపులకు గురి చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కన్న కూతురి మీద ఆమె తండ్రి అత్యాచారం చెయ్యడం మొదలుపెట్టారు. ఇంటి నుంచి బయటకు వెళితే బతకలేనని భయపడిన ఆ అమ్మాయి ఇంతకాలం కన్న తండ్రి కామం తీర్చుతూ వచ్చింది. విసయం బయటకు చెబితే చంపేసి నీ తల్లి శవం పక్కన పూడ్చిపెడుతానని తండ్రి అతని కూతురిని బెదిరించాడు. రానురాను తండ్రి ఆగడాలు ఎక్కువ కావడంతో మైనర్ అమ్మాయి తట్టుకోలేకపోయింది. కన్న తండ్రి టార్చర్ ఎక్కువ కావడంతో ఆ అమ్మాయి తెగించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యి కామాంధుడిని అరెస్టు చేసి  కోర్టు ముందు హాజరుపరిచి కోర్టు అనుమతితో వారం రోజులు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)