సంతానం ఎక్కువుంటే ప్రభుత్వ పథకాలకు అనర్హత ?

Telugu Lo Computer
0


నలుగురి కన్నా ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తున్నట్లు మణిపూర్‌ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌ సింగ్‌ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం గురువారం మణిపూర్‌ స్టేట్‌ పాపులేషన్‌ కమిషన్‌ ఏర్పాటు కోసం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఈ ఆరినెన్స్‌ లో నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు ఎటువంటి ప్రభుత్వ ప్రయోజనాలు అందిచకూడదని నిర్ణయించినట్లు సమాచారం. మణిపూర్‌ స్టేట్‌ పాపులేషన్‌ కమిషన్‌ కింద..ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబంలోని ఏ వ్యక్తికి కూడా ప్రభుత్వ ప్రయోజనాలు అందించబడవు. రాష్ట్రంలో జనాభా కమిషన్‌ ఏర్పాటు చేయాలని గతంలో రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ప్రైవేట్‌ తీర్మాణాన్ని ఆమోదించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మణిపూర్‌ రాష్ట్రంలో మొత్తం 28.56 లక్షల మంది ఉన్నారు. 2001లో ఇది 22.93 లక్షలుగా ఉంది. గతంలో అస్సాం ప్రభుత్వం జనవరి 1, 2021 తర్వాత ఇద్దరు పిల్లలు కంటే ఎక్కవ మంది సంతానం ఉంటే ఆ వ్యక్తిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోకి బయటి వ్యక్తుల చొరబాట్లు తీవ్రం కావడంతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు బిజెపి ఎమ్మెల్యే ఖుముక్చమ్‌ జోయ్ కిసాన్‌ తెలిపారు. అధికారిక డేటా ప్రకారం..1971-2001 నుండి మణిపూర్‌ కొండ ప్రాంత జిల్లాల్లో 153.3 శాతం జనాభా పెరిగింది. 2001-2011 మధ్య కాలంలో ఇది 250 శాతంగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)