బెంగళూరులో ఇడ్లీ ఏటీఎం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 14 October 2022

బెంగళూరులో ఇడ్లీ ఏటీఎం


బెంగళూరుకు చెందిన ఆంట్రప్రెన్యూర్స్ షరన్ హీరేమత్, సురేష్ చంద్రశేఖరన్ ఫ్రెషాట్ రోబోటిక్స్ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ స్టార్టప్ ఇడ్లీ ఏటీఎంను తయారు చేసింది. బెంగళూరులో మొదటి ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను ఏర్పాటు ఈ స్టార్టప్  చేసింది. మొత్తం ఆటోమేటెడ్ ప్రాసెస్‌లో పనిచేస్తుంది. కస్టమర్ వచ్చి తమకు కావాల్సిన ఆర్డర్ ఇస్తే చాలు, వేడి వేడి ఇడ్లీ పార్శిల్‌లో వచ్చేస్తుంది. అక్కడే చట్నీ, సాంబార్ కూడా ఉంటుంది. పార్శిల్ ఇంటికి తీసుకెళ్లొచ్చు. లేదా ఇడ్లీ అక్కడే టేస్ట్ చేయొచ్చు. ఈ అద్భుతమైన ఐడియా వెనుక షరన్ హీరేమత్ ఎదుర్కొన్న అనుభవమే కారణం. 2016లో తన కూతురుకు ఆరోగ్యం బాగాలేనప్పుడు అర్ధరాత్రి ఇడ్లీ కొనడానికి బయటకు వెళ్లాడు. కానీ ఎక్కడా రెస్టారెంట్లు తెరిచిలేవు. ఎప్పుడంటే అప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంలు ఉన్నట్టు, ఇడ్లీ కొనడానికి ఏటీఎంలు ఎందుకు ఉండకూడదని అనుకున్నాడు. ఎప్పుడైనా ఫ్రెష్ ఇడ్లీ సప్లై చేయడానికి ఇడ్లీ ఏటీఎం తయారు చేయాలన్న ఆలోచనతో ఫ్రెషాట్ రోబోటిక్స్ స్టార్టప్‌ ప్రారంభించారు. ఆటోమెటిక్ మెషీన్ సాయంతో ఎప్పుడైనా ఇడ్లీ కొనడానికి ఇది సరైన మార్గమని వారి అభిప్రాయం. తమ ఫుడ్‌బాట్ ఇడ్లీలు మాత్రమే కాదు, దక్షిణ భారత దేశానికి చెందిన రుచికరమైన వంటకాలను అందించే మొదటి పూర్తి ఆటోమేటెడ్ కుకింగ్ అండ్ వెండింగ్ మెషీన్ అని చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూరులో రెండు లొకేషన్లలో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో ఆఫీసులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో ఈ మెషీన్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఇన్నారు. కేవలం ఇడ్లీ బాట్ కాకుండా దోశా బాట్, రైస్ బాట్, జ్యూస్ బాట్లను పరిచయం చేస్తామంటున్నారు.

No comments:

Post a Comment