ఆంధ్రప్రదేశ్ లో నిండుకుండలా జలాశయాలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్ర విపత్తు శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో అక్టోబర్ 9వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈరోజు  6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే.. ఈ నేపథ్యంలో భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే.. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షం కురుస్తుంది. అయితే.. మద్దిలెరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భీమవరం, పెసరవాయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుందూ నీటిమట్టం మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. పోలీస్, రెవెన్యూ, మునిసిపల్ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. కర్నూలు సుంకేసుల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 34,931 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 33,936 క్యూసెక్కులు ఉంది. 8 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కెసి కాలువకు 995 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా.. ప్రస్తుత సామర్థ్యం0.954 టీఎంసీలుగా ఉంది. అనకాపల్లి జిల్లా వి.మాడుగుల పెద్దేరు జలాశయంకు వరద నీరు ఇన్ ప్లో 1124 క్యూసెక్కుల ఉండగా.. ఔట్ ఫ్లో 1124 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ట నీటి సామర్థ్యం 137.00 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం 135.80 టీఎంసీలుగా ఉంది .

Post a Comment

0Comments

Post a Comment (0)