రాజస్థాన్ లో హిజ్రాలకు కొత్త పథకం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 17 October 2022

రాజస్థాన్ లో హిజ్రాలకు కొత్త పథకం !


సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్లకు  రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. లింగమార్పిడి చేసుకునే వారికి ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. ఆ రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వీరిలో లింగమార్పిడి చేసుకునే వారి కోసం ఈ ప్రత్యేక ఆర్దిక సాయాన్ని అందిస్తామని తెలిపింది. ఉచిత సర్జరీ లేదా రూ. 2.50 లక్షలు నగదు ఇస్తామని పేర్కొంది. ఇందుకోసం రూ. 10 కోట్ల నిధులతో 'ఉత్తాన్ కోష్‌'ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సామాజిక న్యాయం, సాధికారత శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఓం ప్రకాశ్ తోష్నివాల్ వివరాలను వెల్లడించారు. ఆసక్తి కల ట్రాన్స్ జెండర్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా, సమాజంలో ట్రాన్స్ జెండర్ల పట్ల ఉన్న వివక్షలో ఈ మధ్య కొంత మార్పు కనిపిస్తోంది. కొన్ని ప్రభుత్వాలు వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. 

No comments:

Post a Comment