పిల్లలతో క్షుద్ర పూజలు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 13 October 2022

పిల్లలతో క్షుద్ర పూజలు


ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి, నరమాంసం వండుకుని తిన్న సంఘటన మరువక ముందే కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని మలయాళపుజా పట్టణానికి చెందిన శోభన అలియాస్ వాసంతి క్షుద్ర పూజలు చేస్తున్నది. చిన్న పిల్లలను తన ముందు కూర్చోబెట్టి తాంత్రిక కార్యాలు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో క్షుద్ర పూజలో పాల్గొన్న ఒక చిన్నారి స్పృహతప్పి పడిపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు శోభనకు వ్యతిరేకంగా గురువారం పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆమెపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు. క్షుద్ర పూజలు చేస్తున్న ఆ మహిళను అరెస్ట్‌ చేసే వరకు ఆందోళనలు విరమించబోమని భీష్మించారు. దీంతో డీఎస్పీ ఆదేశాలతో మంత్రగత్తె శోభనను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. క్షుద్ర పూజలకు పిల్లలను వినియోగించడంపై ఆమెను ప్రశ్నిస్తున్నారు.

No comments:

Post a Comment