టెక్నాలజీ, టాలెంట్ దేశానికి పునాదులు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని నోవాటెల్లో ఐక్యరాజ్యసమితి రెండో ప్రంపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సదస్సు జరుగుతోంది.  ఈ నెల10న ప్రారంభమైన సదస్సు 14వ తేదీ వరకు జరుగనుంది. ఐక్యరాజ్య సమితితో పాటు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. సదస్సులో 120 దేశాల నుంచి దాదాపు 2వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ ఈ సదస్సులో వర్చువల్ గా పాల్గొని, ప్రసంగిస్తూ  టెక్నాలజీ, టాలెంట్ రెండు దేశానికి పునాదులాంటివి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పర్యటన, ఆతిధ్యం, సాంస్కృతిక, సంప్రదాయంకు ప్రాధాన్యత ఇచ్చే హైదరాబాద్ లో సదస్సు జరగడం గొప్ప విషయమని మోడీ అన్నారు. ఎవరూ వెనకబడి ఉండకూడదు అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందన్నారు. టెక్నాలజీ, టాలెంట్ దేశ అభివృద్ధికి దోహదపడుతాయని అన్నారు. జియోస్పేషియల్ తో గ్రామీణ ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందని మోడీ తెలిపారు. టెక్నాలజీతో భారతదేశం చాలా వేగంగా ముందుకు వెళుతుందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)