పహాడీవాలీ మాతకి చెప్పులు, బూట్లు సమర్పిస్తారు !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో ఓ ఆలయంలో అమ్మవారికి చెప్పులను కానుకగా సమర్పిస్తారు. కోలా ప్రాంతంలో జిజిబాయిగా అమ్మవారిని కొలిచే పహాడీవాలీ మాత ఆలయం వుంది. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ అమ్మవారిని నిత్యం పూజిస్తారు. అమ్మవారిని భక్తులు తమ కుమార్తెగా భావించి ఆరాధిస్తారు. రాత్రిపూట అమ్మవారు చెప్పులు ధరిస్తారనేది ఇక్కడి భక్తుల విశ్వాసం. అందుకే, ఆమెకు చెప్పుల్నీ, బూట్లనీ కానుకలుగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారికి పాదరక్షలు సమర్పిస్తే ప్రసన్నురాలై తమ కోర్కెలను తీరుస్తారని గ్రామస్థులు చెబుతున్నారు. నవరాత్రుల సందర్భంగా విదేశాల నుండి కూడా భక్తులు అమ్మవారి కోసం చెప్పులు, అలంకరణ సామగ్రి పంపిస్తారని ఆలయ పూజారి ఓం ప్రకాశ్ మహారాజ్ తెలిపారు. చెప్పులు, బూట్లతో పాటు టోపీలు, కళ్లద్దాలు, వాచీలను కూడా సమర్పిస్తారని పేర్కొన్నారు. ఈసారి సింగపూర్, ప్యారిస్, జర్మనీ, అమెరికా నుంచి కూడా అమ్మవారికి చెప్పులు అందినట్టు ఆయన తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)