రోడ్లన్నీ గుంతలమయంపై వినూత్న నిరసన - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 16 October 2022

రోడ్లన్నీ గుంతలమయంపై వినూత్న నిరసన


బీహార్‌లో రోడ్ల దుస్థితిపై వినూత్న తరహాలో నిరసనకు దిగారు సమస్తిపూర్‌ వాసులు. హాజీపూర్-బచ్వారా వెళ్లే జాతీయ రహదారి -122ని బాగు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం మొహియుద్దీన్ నగర్ మార్కెట్ సమీపంలోని రహదారిపై ఉన్న మురికి నీటిలోనే కూర్చుని నిరసన చేపట్టారు. గత మూడు రోజులుగా నిరసన చేపడుతున్నా అధికారులు స్పందించడం లేదని ఓ నిరసనకారుడు తెలిపారు. తాము మూడు రోజుల నుంచి నిరసన చేపడుతున్నామని, గుంతలమయమైన రోడ్లను బాగు చేయాలని వారు డిమాండ్ చేస్తు్న్నారు. జాతీయ రహదారి -122ను బాగు చేయడానికి కాంట్రాక్టర్‌కు రూ.25 లక్షలు మంజూరు అయ్యాయని.. అయినా పట్టించుకోవడం లేదని నిరసనకారులు ఆరోపించారు. రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా.. జాతీయ రహదారి-122 టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని.. హైవేపై గుంతల మరమ్మతులు ప్రారంభమయ్యాయని.. కొంచెం సమయం పడుతుందని ఓ అధికారి వివరించారు.

No comments:

Post a Comment