ఆన్ లైన్ షాపింగ్​ లో పెరిగిన అమ్మకాలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 6 October 2022

ఆన్ లైన్ షాపింగ్​ లో పెరిగిన అమ్మకాలు !


ఈ ఏడాది పండుగ సీజన్​లో ఆన్​లైన్​ షాపింగ్​ రూ. 40 వేల కోట్లను దాటిందని అంచనా. గత ఏడాదితో పోలిస్తే ఈ సేల్స్​ 27 శాతం పెరిగినట్లు రెడ్​సీర్స్​ స్ట్రాటజీ కన్సల్టింగ్​ వెల్లడించింది. అమ్మకాలలో ఫ్లిప్​కార్ట్​ గ్రూప్​ (మింత్రా, షాప్సి) తన లీడర్​షిప్​ను కొనసాగించినట్లు పేర్కొంది. ఇక ఆర్డర్​ వాల్యూమ్స్​లో మీషో రెండో ప్లేస్​లో నిలిచినట్లు తెలిపింది. ఫెస్టివ్​ సేల్​ మొదటి వారం ఎనాలిసిస్​ను రెడ్​ సీర్స్​ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​లు సెప్టెంబర్​22 - 30 మధ్య భారీ ఆఫర్స్​తో సేల్స్​ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆన్​లైన్​ షాపింగ్​ లిస్టులో మొబైల్​ ఫోన్స్​ అమ్మకాలే ఎక్కువగా ఉన్నట్లు రెడ్​సీర్స్​ వెల్లడించింది. గ్రాస్​ మర్చండైజ్​ వాల్యూ లో 41 శాతం వాటాతో మొబైల్స్​ కేటగిరీ టాప్‌లో ఉన్నట్లు తెలిపింది. ప్రతీ గంటకు 56 వేల మొబైల్​ ఫోన్ల అమ్మకాలు జరిగాయని పేర్కొంది. జీఎంవీలో 20 శాతం వాటాతో ఫ్యాషన్​ రెండో ప్లేస్​లో నిలిచినట్లు తెలిపింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఫ్యాషన్​ కేటగిరీ 48 శాతం గ్రోత్​ సాధించింది. మొబైల్​ ఫోన్ల అమ్మకాలు ఏడు రెట్లు, ఎలక్ట్రానిక్స్​అండ్​ అప్లయెన్సెస్​ సేల్స్​ 5 రెట్లు పెరిగినట్లు రెడ్​సీర్స్​రిపోర్టు వివరించింది.

No comments:

Post a Comment