హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్లో ఒకే దశలో ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. 68 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలోలో నవంబర్ 12న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. హిమాచల్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరితో పూర్తికానుంది. ప్రస్తుతం హిమాచల్లో అధికార ఎన్డీఏకు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నోటిఫికేషన్‌ : అక్టోబర్‌ 17, నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్‌ 25, నామినేషన్ల పరిశీలన : అక్టోబర్‌ 27, నామినేషన్ల ఉపసంహరణ : అక్టోబర్‌ 29.  మొత్తం ఓటర్ల సంఖ్య 55,07,261 కాగా.. అందులో పురుషులు 27,80,208, మహిళలు 27,27,016 మంది ఉన్నారు. 1,86,681మంది ఓటర్లు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హిమాచల్ లో 80 ఏండ్లకుపైగా వయసున్న ఓటర్లు 1,22,087 కాగా.. 100 ఏండ్లు దాటిన ఓటర్లు 1,184 మంది ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)