రిషి సునాక్ మార్గం సుగమం !

Telugu Lo Computer
0


బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి రిషి సునాక్ ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం అయింది. ఆయనకు పోటీదారుగా నిలిచిన పెన్నీ మోర్డాంట్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. భారత సంతతికి చెందిన రుషి సునాక్ బ్రిటన్‌కు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధాన మంత్రి కాబోతున్నారు. రిషి సునాక్ సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో లిజ్ ట్రస్ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆమె అనేక యూ-టర్న్‌లు తీసుకుని విమర్శలపాలై, చివరికి రాజీనామా చేశారు. దీంతో రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు పొందిన బ్రిటన్‌కు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వం వహించేందుకు రిషి సునాక్ ముందుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)