ఏడాది బాలుడిపై చిరుత దాడి !

Telugu Lo Computer
0


ముంబై శివారు ప్రాంతమైన గోరేగావ్ లోని ఆరే కాలనీలో అటవీ ప్రాంతంలో తల్లితో కలిసి సమీపంలో ఉన్న గుడికి వెళ్తున్న క్రమంలో చిరుత దాడి చేసిందని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన తర్వాత చిన్నారిని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారి మరణించింది. ఈ ఘటనపై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు చేశారు. ముంబైలోని ఆరే ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇక్కడ ప్రజలు – వన్యప్రాణులకు మధ్య సంఘర్షణ ఏర్పడుతోందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అటవీ శాఖ కార్యాచరణ ప్రారంభించిందని ఆ శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. వన్యప్రాణి అంబులెన్సులతో పాటు వాలంటీర్లను ఈ ప్రాంతంలో మోహరించారు. చిరుతపులి నిపుణులు, పశువైద్యులు, అటవీ శాఖ అధికారులు ఈ వారం మొత్తం ఆరే కాలనీలోనే ఉండనున్నారు. చిరుత కదలికలను గుర్తించడానికి, పర్యవేక్షించడానికి రాత్రిపూట పెట్రోలింగ్ చేయడంతో పాటు కెమెరా ట్రాపులను అమర్చనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)