కోర్టులకు అన్నిసెలవులు ఎందుకు ?

Telugu Lo Computer
0


కోర్టులు ఎక్కువ రోజులు సెలవులు తీసుకోవడం వల్ల ప్రజలకు ప్రాథమికంగా అందాల్సిన ప్రాథమిక హక్కుల విషయంలో భంగం వాటిల్లుతోందని ఓ పిటిషనర్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులు మూసి ఉండడం వల్ల వ్యాజ్యాల దాఖలు, వాటిపై విచారణలో జాప్యం జరుగుతోందని అందులో పేర్కొన్నారు. సబీనా లక్డావాలా అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అతని తరపు న్యాయవాది మాట్లాడుతూ న్యాయమూర్తులు సెలవులు తీసుకోవడం పట్ల పిటిషనర్‌కి అభ్యంతరం లేదు.  కానీ న్యాయ వ్యవస్థలో ఉండే సభ్యులు అదే సమయంలో సెలవులు తీసుకోవడం పట్ల అభ్యంతరం ఉందన్నారు. ఏడాది పొడవునా న్యాయస్థానాలు పనిచేసే విధంగా ఉండాలని కోరుతున్నామన్నారు. దీంతో స్పందించిన జస్టిస్ ఎస్ వీ గంగా పూర్ వాలా, జస్టిస్ ఆర్ ఎన్ లడ్డా బెంజ్ నవంబర్ 15న విచారణ జరుపుతామని తెలిపింది. కాగా, దీపావళి పండుగ సందర్భంగా కోర్టులు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 9 వరకు 20 రోజులు సెలవులు తీసుకుంటున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)