సుయోల్లా బ్రేవర్మన్ రాజీనామా

Telugu Lo Computer
0


భారత సంతతికి చెందిన బ్రిటన్ హోంమంత్రి సుయోల్లా బ్రేవర్మన్ రాజీనామా చేశారు. ఇటీవలే కన్జర్వేటీవ్ పార్టీ నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన లిస్ ట్రస్ అధికారం చేపట్టారు. ఆమె తీసుకున్న ఆర్థిక నిర్ణయాల కారణంగా బ్రిటన్‌లో ఆర్థిక రంగం తీవ్రస్థాయిలో దెబ్బతింది. చేసేదేమిలేక దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అయితే ఇలా చేయడం వల్ల బ్రిటన్ ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ఈ క్రమంలోనే ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేకించినందుకు ఆర్థిక మంత్రి క్వాసి క్వార్టెంగ్‌ను పదవి నుంచి తప్పించారు. ఇప్ప్పుడు హోం మంత్రి సుయెల్లాబ్రేవర్మన్‌ తన పదవికి రాజీనామా చేశారు.  గోవా మూలాలున్న తండ్రి తమిళనాడు మూలాలున్న తల్లికి జన్మించిన బ్రేవర్మన్ 43రోజుల క్రితమే యూకే హోం సెక్రటరీగా నియమితులయ్యారు. 'నేను తప్పు చేశాను. మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను' అని ప్రకటించారు సుయెల్లాబ్రేవర్మన్‌. అంతకుముందు ఆమె ఉదయం ఒక 'ప్రభుత్వ పాలసీ డ్రాఫ్ట్‌'ను తన వ్యక్తి గత ఈ మెయిల్‌ నుంచి ఎంపీలకు పంపించారు. వలసలపై రూపొందించిన ఈ డ్రాఫ్ట్‌ను బ్రిటన్‌ ప్రభుత్వం ఇంకా పార్లమెంటుకు సమర్పించలేదు. పాలసీ డ్రాఫ్ట్‌ను వ్యక్తిగత మెయిల్‌ నుంచి పంపడం తప్పు అని తర్వాత గ్రహించానని, అందుకే రాజీనామా చేస్తున్నానని బ్రావెర్మన్‌ ప్రకటించారు. రాజీనామా లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. లేఖలోనే ట్రస్‌ ప్రభుత్వంపై బ్రావెర్మన్‌ విమర్శలు చేశారు. గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభుత్వం ఏం చేస్తోందో.. ఎటు పోతున్నామో అర్థం కావడం లేదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ట్రస్‌ ప్రభుత్వం ప్రస్తుతం అయోమయంలో ఉంది. ఆమె ఏ క్షణమైనా ప్రధాని పదవి నుంచి దిగిపోవచ్చు అని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)