పులి దాడిలో ఇద్దరు పశువుల కాపర్లు మృతి

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని మూతాలాకా చించాడా గ్రామానికి చెందిన నానాజీ నీకేసర్ (53), దివరూ వసలేకర్ (55) అనే ఇద్దరు పశువులను మేపేందుకు సమీపంలో అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఈ సమయంలో వీరిద్దరిపై పులి పంజా విసిరింది. దీంతో వారిద్దరు మరణించారు. దీంతో స్థానికంగా ఉన్న గ్రామస్థులు భయాందోళనకు గురువుతున్నారు. ఇటీవల కాలంలో చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో వరసగా పలువురు పులుల దాడులకు గురువుతున్నారు. పశువులను వేటాడి చంపేస్తున్నాయి. దీంతో పాటు సరిహద్దుల్లో ఉన్న కొమురంభీం జిల్లాలో కూడా పులుల సంచారం పెరిగింది. అటవీ ప్రాంతాలకు సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు పులుల భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. గత వారం చంద్రపూర్ జిల్లాలో 13 మందిని చంపిన పెద్దపులిని అటవీ అధికారులు పట్టుకున్నారు. దీని తర్వాత వారం తిరగకముందే మరో పులి ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. ఇదిలా ఉంటే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలం వెంపల్లిలో పశువుల మందపై పులి దాడి చేసింది. రెండు పశువులను హతమార్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)