ఇమ్రాన్ ఖాన్‌ పిటిషన్ తిరస్కరణ !

Telugu Lo Computer
0


పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై  ఇప్పటికే అనేక కేసులు నమోదు అయ్యాయి. విదేశీ నేతల నుంచి తనకు లభించిన బహుమతులను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచిపెట్టినందుకు అక్కడి ఎన్నికల కమీషన్ ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఐదేళ్ల పాటు ప్రభుత్వ పదవిలో కొనసాగడానికి అనర్హుడిగా ప్రకటించింది. దీంతో ఆయన తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఆయన పాకిస్తాన్ హైకోర్టులో సవాల్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ పిటిషన్ ను ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఇక ప్రధాని కలలు ఆవిరి అయ్యాయి. పాకిస్తాన్-తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్.. వ్యక్తులను అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి లేదంటూ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఐదేళ్ల అనర్హత ప్రస్తుత అసెంబ్లీ లోని ఐదేళ్ల కాలానికి వర్తిస్తుందా..? లేక పోతే పాకిస్తాన్ ఎన్నికల సంఘం తీర్పు వెల్లడించిన తేదీ నుంచి అనర్హత కాలం మొదలవుతుందా..? అనే దానిపై స్పష్టత రాలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)