12 కేజీల భారీ కంద ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 24 October 2022

12 కేజీల భారీ కంద !


ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ఓ రైతు తెచ్చిన కంద 12 కేజీల బరువు తూగింది. ఈ కందను అంతా ఆసక్తిగా గమనించారు. సాధారణంగా కంద రెండు నుంచి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది. దీనిని చూసేందుకు పలువురు ఆసక్తి చూపారు. బాహుబలి కంద అంటూ కొందరు కామెంట్ చేయడం కనిపించింది. కంద కూడా ఆ రైతుకు మంచి ఆదాయం తెచ్చిపెట్టింది. వాతావరణంలో మార్పులు, నేలలో పోషకాల కారణంగా ఇలాంటి కంద పెరుగుతుందని రైతులు అంటున్నారు. మొత్తం మీద ఈ బాహుబలి కంద దీపావళి వేళ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. కందను సాదాసీదా అని తీసిపారేయలేం. కందలో పుష్కలంగా పోషకాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఇది కాన్సర్‌ను అడ్డుకునే శక్తి కూడా ఈ కందకు వుంటుంది. కంద గుండె సమస్యలకు చెక్ పెడుతుందని తేలింది. మీ బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కంద రుచి కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రై చేసుకొని కూడా తింటుంటారు. 

No comments:

Post a Comment